Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను అక్కడ ఎవరూ గుర్తుపట్టలేదు..!

2011లో పవన్‌ కల్యాణ్‌ ‘పంజా’ సినిమా షూటింగ్‌ సమయంలో కలకత్తా వెళ్లారుట దాదాపు రెండు నెలలు అక్కడే ఉండి రద్దీగా ఉండే ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు.

Published : 11 Oct 2022 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్‌ అన్నంతగా  అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనకు అభిమానులతో పాటు భక్తులు కూడా ఉంటారంటూ అప్పుడప్పుడు ఆయన అభిమానులు చెప్పడం విన్నాం. పవన్‌కు జనాల్లో అంత క్రేజ్‌ ఉంది. మరి అలాంటి పవన్‌ను ఒక ప్రాంతంలో గుర్తుపట్టలేదట. అదెక్కడో ఏ సంవత్సరంలో జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్‌ చదివేయండి..

2011లో పవన్‌ కల్యాణ్‌ ‘పంజా’ సినిమా షూటింగ్‌ సమయంలో కలకత్తా వెళ్లారుట దాదాపు రెండు నెలలు అక్కడే ఉండి రద్దీగా ఉండే ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. ఆసక్తికర విషయమేమిటంటే అంత రద్దీగా ఉన్న ప్రాంతంలోనూ పవన్‌ను ఎవరూ గుర్తుపట్టకపోవడం. అక్కడ పవన్‌ రోడ్డుపై తిరుగుతూ షాపింగ్‌ కూడా చేశారట. అప్పట్లో ఇంటర్నెట్ అందరికీ ఇంతగా అందుబాటులో లేదు కాబట్టి పవన్‌ అలా ఓ స్వేచ్ఛగా తిరిగారని  అభిమానులు చెబుతున్నారు. అది కూడా నిజమే కదా మరీ. ఇక సినిమాల విషయానికొస్తే పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్నారు. ఇది పవన్‌కు తొలి పాన్‌ ఇండియా చిత్రం కానుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని