Manchu Vishnu Dilraju: మంచు విష్ణుని కలిసిన దిల్‌రాజు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణును (Manchu Vishnu) గురువారం ఉదయం ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు (Dilraju) కలిశారు. మంచు విష్ణు కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజు ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు.

Updated : 04 Aug 2022 17:52 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణును (Manchu Vishnu) గురువారం ఉదయం ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు (Dilraju) కలిశారు. మంచు విష్ణు కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజు ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని, అలాగే, కొత్తవారు ‘మా’లో భాగమయ్యేలా  ప్రోత్సహించాలని దిల్‌ రాజుని విష్ణు కోరారు. ఈ మేరకు ‘మా’ సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్‌రాజుకు అందించారు. ‘మా’ సభ్యులకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టాలీవుడ్‌ నిర్మాతలను విష్ణు ఇకపై కలవనున్నారు. ఇందులో భాగంగా దిల్‌రాజుతో భేటీ అయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని