Anasuya: దయచేసి.. నా ట్వీట్లను రాజకీయం చేయొద్దు: అనసూయ
ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ (Anasuya) నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని కోరుకున్నారు...
హైదరాబాద్: ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ (Anasuya) నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఉదయం వరుస ట్వీట్స్ చేశారు. ‘‘ట్విటర్ వేదికగా నేను ఏం పెట్టినా.. అవన్నీ నా అభిరుచి, ఇష్టపూర్వకంగానే. ఒక వ్యక్తి, సంస్థ, సిద్ధాంతాన్ని ప్రమోట్ చేయడానికో.. డబ్బుల కోసమో.. ట్వీట్స్ చేయడం లేదు. ఏదైనా విషయంపై పూర్తి సమాచారం ఉన్నప్పుడే నేను పెదవి విప్పుతున్నాను. అలాగే, ఏదైనా అంశంపై మీరు మాట్లాడాలని కోరినా .. దానిపై సరైన అవగాహన లేనప్పుడు నేను మాట్లాడటం మానేస్తున్నా. ఒకవేళ మాట్లాడినా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దానివల్ల నేను ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నా. కాబట్టి దయచేసి నా ట్వీట్లపై రాజకీయం చేయవద్దు’’ అని అనసూయ కోరారు. అయితే.. ఉన్నట్టుండి ఆమె ఈ విధంగా ట్వీట్లు పెట్టడంతో.. ‘‘అనసూయ.. మీరెందుకు ఇలా ట్వీట్స్ చేశారు?’’, ‘‘ఏమైంది?’’ అని కామెంట్లు పెడుతున్నారు.
గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచార కేసులో విడుదలైన దోషులకు ఓ సంస్థ సన్మానం చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘‘మన దేశానికి ఇదొక మచ్చ. సన్మానం చేయడానికి వారేమైనా స్వాతంత్ర్య సమరయోధులా!! ఈరోజు బిల్కిస్ బానో.. రేపు వేరెవరైనా కావొచ్చు. ఇప్పటికైనా గళం విప్పండి’’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌ని అనసూయ గురువారం రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అత్యాచారం చేసేవాళ్లను వదిలేసి.. మహిళల్ని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’’ అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అనసూయ పెట్టిన ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడెలా మాట్లాడుతున్నారు’’ అంటూ కామెంట్లు చేశారు. నెటిజన్ల నుంచి వరుస కామెంట్లు వస్తోన్న తరుణంలోనే అనసూయ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ