Hi Nanna: టాలీవుడ్‌కు మరో బాలీవుడ్‌ నటుడు.. నాని సినిమాతో ఎంట్రీ

నాని సినిమాతో మరో బాలీవుడ్‌ నటుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘హాయ్ నాన్న’ (Hi Nanna)సినిమాలో ఓ పాత్రలో కనిపించనున్నాడు.

Published : 26 Jul 2023 15:05 IST

హైదరాబాద్‌: ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ నటులు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కొందరు విలన్‌ పాత్రల్లో కనిపించడానికి సిద్ధమవుతుండగా మరికొందరు అతిథి పాత్రలో అలరించనున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన మరో హీరో టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యారు. నాని హీరోగా శౌర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హాయ్ నాన్న’ (Hi Nanna). తండ్రీ కూతుళ్ల అనుబంధంతో సాగే ఫీల్‌ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా ఇది రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో అంగద్‌ బేడి (Angad Bedi) నటించనున్నారు.

‘పింక్‌’, ‘టైగర్‌3’ సినిమాల్లో నటించిన అంగద్ బేడి నాని సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజుల ‘హాయ్ నాన్న’లో అతడు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆయన ఖరారు చేశారు. ఓ ఇంటర్వ్యూలో అంగద్ బేడి మాట్లాడుతూ..‘‘ తెలుగులో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా సినిమాలను భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు. ‘హాయ్ నాన్న’ ఎమోషనల్‌గా అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. అయితే ఆయన ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.

పవర్‌స్టార్‌ మాస్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

నాని సరసన మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దీని షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. సోమవారం నుంచి నాయకానాయికలు, ఇతర చిత్రబృందంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేయగా దానికి భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ ఓ కీలకపాత్రలో కనిపించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని