Samantha: ఆ క్షణాలు ఆనందించలేకపోయా.. భయపడ్డా: సమంత

తన కెరీర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నటి సమంత (Samantha). 

Published : 16 Mar 2024 00:16 IST

న్యూదిల్లీ: దాదాపు 14 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు నటి సమంత (Samantha). యాక్టింగ్‌ నుంచి ఇటీవల కాస్త విరామం తీసుకున్న ఈ భామ ఇప్పుడిప్పుడే కెమెరా ముందుకు వస్తున్నారు. న్యూదిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ 2024’లో ఆమె పాల్గొన్నారు. తన కెరీర్‌, మయోసైటిస్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితుల కారణంగానే మయోసైటిస్‌ ఉందనే విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు.

‘‘నటిగా కెరీర్‌ మొదలుపెట్టి దాదాపు 14 ఏళ్లు అయ్యింది. ప్రతిరోజూ 10 రకాల పనులు చేసేదాన్ని. ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. నా శరీరం, మనసుకు ఎలాంటి బ్రేక్‌ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే, ఆ పద్నాలుగేళ్లలో కొన్ని బాధపడిన సంవత్సరాలున్నాయి. ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌తో ఇబ్బందిపడిన క్షణాలున్నాయి. ఏదో ఒకరోజు నా నుంచి ఇది దూరమైపోతుందని భయపడేదాన్ని. ఈ సిండ్రోమ్‌ కారణంగా.. కెరీర్‌ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయా. విజయం సాధించినా అది నా వల్ల వచ్చింది కాదని.. వేరేవారి వల్ల వచ్చిందని భావించేదాన్ని’’ అని సమంత చెప్పారు.

మయోసైటిస్‌ కారణంగా గతంలో తాను నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ (యశోద) ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని.. అప్పట్లో ఎన్నో వదంతులు వచ్చాయన్నారు. ప్రచారం చేయకపోతే సినిమా చనిపోయేలా ఉందని నిర్మాత చెప్పడంతో ఒకేఒక్క ఇంటర్వ్యూ ఇచ్చానన్నారు. అప్పటి పరిస్థితుల రీత్యా తనకు మయోసైటిస్‌ ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని