Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’.. పాటలోనే సినిమా చూపించారు..!

చాలాకాలం తర్వాత ప్రభాస్‌ నటించిన పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రం కావడంతో ‘రాధేశ్యామ్‌’పై యావత్‌ సినీ ప్రియుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

Published : 25 Feb 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత ప్రభాస్‌(Prabhas) నటించిన పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం కావడంతో ‘రాధేశ్యామ్‌’(Radhe syam)పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్‌ పాన్‌ ఇండియా సినిమాలో ప్రభాస్‌, పూజా హెగ్డే జోడీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో తాజాగా విడుదలైన ‘ఈ రాతలే’ అనే వీడియో సాంగ్‌ రుచి చూపించింది. ఇందులో.. ప్రభాస్, పూజా పెయిర్‌ చూడముచ్చటగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్‌ లవర్‌బాయ్‌ లుక్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. అందమైన లొకేషన్లలో ఈ సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. కృష్ణకాంత్‌ రచించిన ఈ గీతాన్ని యువన్‌ శంకర్‌రాజా, హరిణి ఇవటూరి ఆలపించగా జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించారు.

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ నటులు కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌, కునాల్‌రాయ్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని