Emergency: కంగనా రనౌత్‌ ‘ఎమర్జెన్సీ’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

స్వీయ దర్శకత్వంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’. తాజాగా విడుదల తేదీ ఖరారైంది.

Updated : 23 Jan 2024 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ (Kangana Ranaut) నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). ఈ సినిమా కొత్త విడుదల తేదీ తాజాగా ఖరారైనట్లు కంగనా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ‘‘ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ‘ఎమర్జెన్సీ’ రిలీజ్‌ అవుతుంది.  ఎమర్జెన్సీ నాకు చాలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. ‘మణికర్ణిక’ తర్వాత నేను డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. ఇదొక పీరియాడిక్‌ డ్రామా’’ అని కంగనా తెలిపారు. గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.  గత కొంతకాలంగా విజయానికి దూరంగా ఉన్న కంగనా ఈ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంతకుముందు ఓ సందర్భంలో ఈ సినిమా గురించి కంగనా మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. మొదటి షెడ్యూల్ సమయంలో డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు.

రివ్యూ: మోహన్‌లాన్‌ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘నెరు’ ఎలా ఉంది?

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మాతగానూ వ్యవహరించిన కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని