Karan Johar: కాఫీ విత్‌ కరణ్‌.. ఇకపై అలియా పేరెత్తను: కరణ్‌ జోహార్‌

‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) షో వేదికగా నెటిజన్లు, సినీ ప్రియులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నారు కరణ్‌ జోహార్ (Karan Johar)‌. ఆయన వ్యాఖ్యాతగా...

Published : 30 Sep 2022 01:12 IST

ముంబయి: ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) షో వేదికగా నెటిజన్లు, సినీ ప్రియులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నారు కరణ్‌ జోహార్ (Karan Johar)‌. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో సరికొత్త సీజన్‌ ముగింపు దశకు చేరుకొంది. హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమైన సరికొత్త ఎపిసోడ్‌లో కరణ్‌ షోకు జ్యురీగా వ్యవహరిస్తోన్న పలువురు సోషల్‌మీడియా సెలబ్రిటీలు, కమెడియన్స్‌ పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. ఈ షో విషయంలో నెటిజన్ల నుంచి ఎక్కువగా వచ్చిన ఓ ట్రోల్స్‌పై కరణ్‌ స్పందించారు.

‘‘కరణ్‌.. ఈ సీజన్‌లోని చాలా ఎపిసోడ్స్‌లో మీరు అలియాభట్‌ పేరు సంభోదించారు. అవసరం లేకున్నా టాపిక్‌ తీసుకువచ్చి మరీ ఆమెను మెచ్చుకున్నారు. దీనిపై సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ కూడా వచ్చాయి’’ అని జ్యురీలోని సభ్యులు చెప్పారు. దానిపై కరణ్‌ స్పందిస్తూ.. ‘‘అలియా గురించి నేను ఎక్కువగా మాట్లాడానని అంటున్నారు. నిజంగానే నేను అంతలా మాట్లాడానా? ఇటీవల అలియా - నేను ఇదే విషయంపై చర్చించుకున్నాం. ‘కరణ్‌.. మీరు నాపై చూపిస్తోన్న అభిమానానికి కృతజ్ఞతలు. ఇకపై నా పేరు ఎక్కువగా వాడకండి’ అని అలియా చెప్పింది. అలియా మాట ప్రకారమే ఆ తర్వాత నుంచి ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో వీలైనంత తక్కువగా ఆమె గురించి మాట్లాడాను. అలాగే ఇదే షోలో ఓసారి నేను ‘ITALIA’ అని రాసున్న జాకెట్‌ వేసుకొని వచ్చా. దాన్ని చూసి అందరూ ‘ALIA’ గురించి ప్రమోట్‌ చేయడానికే దాన్ని ధరించాననుకున్నారు. నిజం చెప్పాలంటే అది అలియా కాదు.. ఇటాలియా’’ అని కరణ్‌ వివరించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని