
Pushpa: ‘పుష్ప’రాజ్ అడ్డా .. ‘ఏయ్ బిడ్డా’ ఫుల్ వీడియో వచ్చేసింది
ఇంటర్నెట్ డెస్క్: ‘పుష్ప’ సినిమాలోని పాటలకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో గీతాన్ని పంచుకుంది. కథానాయకుడి పాత్ర గురించి తెలియజేసే ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ ఫుల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అల్లు అర్జున్ డ్యాన్స్, ప్రత్యేకమైన మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చంద్రబోస్ రచించిన ఈ పాటను నకాష్ అజిజ్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. ఈ పాటలోని ఒక్క షాట్ కోసమే (ఏయ్ బిడ్డా మ్యానరిజం) అల్లు అర్జున్ 12 గంటలు శ్రమించారని చిత్ర బృందం ఇటీవల తెలిపింది.
ఈ చిత్రాన్ని ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించారు. ఇందులో అల్లు అర్జున్.. పుష్పరాజ్‌గా కనిపించారు. శ్రీవల్లిగా రష్మిక సందడి చేసింది. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, అజయ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం 2021 డిసెంబరులో విడుదలై ఘన విజయం అందుకుంది. ప్రస్తుతం ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ‘పుష్ప: ది రూల్’ పేరుతో కొనసాగింపు చిత్రం తెరకెక్కనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.