Gaalivaana: డైలాగ్స్‌ లేకుండా ‘గాలివాన’ టీజర్‌..!

గాలివాన టీజర్‌ చూశారా..?

Published : 20 Mar 2022 15:02 IST

హైదరాబాద్‌:  రాధిక, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలివాన’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గాలివాన’ టీజర్‌ను ఆదివారం ఉదయం విడుదలైంది. క్రైమ్‌ సన్నివేశాలతో ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌లో నటీనటుల మధ్య ఎలాంటి సంభాషణలు చూపించలేదు. కొత్తగా పెళ్లిచేసుకున్న ఓ జంట అనుకోని విధంగా హత్యకు గురి కావడం, దాన్ని ఛేదించే క్రమంలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఇంతకీ ఆ జంటను హత్య చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని