కొత్తతరం ప్రేమకథతో...

వానీ రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వెన్నెలవే వెన్నెలవే’. తేజ సజ్జా కథానాయకుడు. మల్లిక్‌  రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.ఒరిజినల్స్‌, మహాతేజ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల శివానీ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె పోషిస్తున్న

Published : 02 Jul 2020 15:16 IST

హైదరాబాద్‌: శివానీ రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వెన్నెలవే వెన్నెలవే’. తేజ సజ్జా కథానాయకుడు. మల్లిక్‌  రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.ఒరిజినల్స్‌, మహాతేజ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల శివానీ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె పోషిస్తున్న వెన్నెల అనే పాత్రకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

‘‘కొత్తతరం ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. శివానీ పక్కింటి అమ్మాయి తరహా లుక్‌లో సందడి చేయబోతున్నారు. వెన్నెల అనే పేరుకు తగ్గట్టుగానే ఆమె పాత్ర కనువిందు చేస్తుంది. ‘ఓ బేబీ’తో ఆకట్టుకున్న తేజ సజ్జా ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌పై ఉంద’’ని చిత్రవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని