Nithiin: ‘తమ్ముడు’ షురూ.. ట్వీట్‌ చేసిన నితిన్‌..!

నితిన్‌ (Nithiin) కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Published : 27 Aug 2023 13:45 IST

హైదరాబాద్‌: వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు నటుడు నితిన్‌ (Nithiin). ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుందని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన నితిన్‌.. సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు.

తాను అభిమానించే హీరో పవన్‌కల్యాణ్‌ నటించిన సినిమా ‘తమ్ముడు’ టైటిల్‌నే తన కొత్త చిత్రానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ‘‘కొన్ని టైటిల్స్‌ ఎంతో బాధ్యత కలిగి ఉంటాయి. మీ ఊహలను మించి ఉండేలా మేము దీన్ని తెరకెక్కిస్తాం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sreeleela: శ్రీలీల కొత్త టాలెంట్‌.. మనసు పారేసుకుంటోన్న నెటిజన్లు

నితిన్‌ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్‌’ చేస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీనితోపాటు ఆయన వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మరో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ విషయానికి వస్తే.. ‘వకీల్‌సాబ్‌’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని