‘టైటానిక్‌’ని వద్దనుకుందట కేట్‌ విన్‌స్లెట్‌

ప్రేమ కథాంశంతో వచ్చి.. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన దృశ్య కావ్యం ‘టైటానిక్‌’. అందులో ‘రోజ్‌’గా సమ్మోహితమైన నటనతో యువత హృదయాల్లో నిలిచిపోయింది కేట్‌ విన్‌స్లెట్‌.

Published : 26 Apr 2023 15:27 IST

ప్రేమ కథాంశంతో వచ్చి.. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన దృశ్య కావ్యం ‘టైటానిక్‌’. అందులో ‘రోజ్‌’గా సమ్మోహితమైన నటనతో యువత హృదయాల్లో నిలిచిపోయింది కేట్‌ విన్‌స్లెట్‌. ఆమె లేని ఆ చిత్రాన్ని ఊహించలేం. కానీ ఒకానొక సమయంలో ‘టైటానిక్‌’లో నటించొద్దు అనుకుందట తను. ఈ ఆసక్తికరమైన సంగతి, ఆడిషన్‌ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాన్ని తాజాగా మీడియాతో పంచుకుంది. ఈ సినిమా కోసం దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ తన బృందంతో కలిసి వందలమందిని ఆడిషన్‌ చేశారు. తను అప్పటికే ఐదు సినిమాల్లో నటించింది. తనకంటూ ఓ గుర్తింపు ఉంది. అయినా అందరితోపాటే ఆడిషన్‌కి వెళ్లింది. ‘ఆ సమయంలో ఆడిషన్‌ చేస్తున్న వ్యక్తిని చూస్తే చాలా చిరాకేసింది. నేను చెప్పేది ఏదీ సరిగా వినిపించుకోలేదు. నటించి చూపిస్తున్నా.. ‘హ్మ్‌’, ‘హా’ అంటున్నాడే తప్ప తన అభిప్రాయమేంటో చెప్పడం లేదు. నాకిది సెట్‌ కాదు.. అక్కడ్నుంచి వెళ్లిపోదాం అనుకున్నా. కానీ తర్వాత మరో రౌండ్‌ ఆడిషన్‌కి పిలిచారు. చివరికి ‘రోజ్‌’ పాత్రకు ఎంపిక చేశారు’ అంటూ ఆనాటి అనుభవం వివరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని