బాదం ఆకుల కోసం ఆగిన షూటింగ్!
అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో బాపు-రమణలు సిద్ధహస్తులు. వారి చిత్రాలు చూస్తుంటే వాస్తవానికి దగ్గరగా అనిపిస్తాయి.
ఇంటర్నెట్‌డెస్క్: అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో బాపు-రమణలు సిద్ధహస్తులు. వారి చిత్రాలు చూస్తుంటే వాస్తవానికి దగ్గరగా అనిపిస్తాయి. అంత హృద్యంగా తెరకెక్కిస్తారు. ‘పెళ్లిపుస్తకం’ (1991) సినిమా షూటింగ్ జరుగుతోంది. స్క్రిప్టులో రాధాకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లు రమణ రాశారు. షాట్స్ రాసినప్పుడు దర్శకుడు బాపు కూడా అదే రాసి, ‘‘బాదం ఆకుల విస్తర్లు కావాలి’’ అని, ప్రొడక్షన్ వాళ్లకి రాసి ఇచ్చారు. షూటింగ్ ఉదయం ఆరంభమైంది. బాదం ఆకులు దొరకలేదని, మామూలు విస్తరాకులు తెచ్చారు ప్రొడక్షన్ వాళ్లు.
‘‘అదేమిటండీ, బాదం ఆకులు దొరక్కపోడం ఏమిటి? ఏమేం కావాలో మన వాళ్లు నిన్న పొద్దున్నే రాసి ఇచ్చారు కదా! బాదం ఆకుల విస్తర్లే కావాలి. వెళ్లి తీసుకురండి. ఇంతపెద్ద హైదరాబాద్‌లో ఎవరింట్లోనూ బాదం చెట్టు లేదా?’’ అని కసిరి పంపించారు బాపు. అవి వచ్చేవరకూ షూటింగ్ లేదు! (సినిమా నిర్మాతలు వాళ్లే గనక సరిపోయింది) ఫలానా ప్రాంతంలో బాదం చెట్టు ఉందంటే, రెండు కార్లు వేసుకుని అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టారు. ఆఖరికి చిక్కడపల్లిలో ఒకరింట్లో బాదం చెట్టు ఉందని ఎవరో చెబితే, అక్కడికి వెళ్లి ఆకులు కోసి తెచ్చి, విస్తర్లు కుట్టి ఇచ్చేసరికి, మధ్యాహ్నం అయింది. అయితేనేం అనుకున్న ఆకులు వచ్చాయి. అప్పటికి ఇడ్లీలు చల్లారిపోయాయి. దీంతో మళ్లీ ఇడ్లీలు తెప్పించి, సీను షూట్ చేశారు. ఐతే, సినిమా పూర్తయ్యాక నిడివి ఎక్కువైందని కత్తిరించిన దృశ్యాల్లో ఈ సన్నివేశమూ పోయింది!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు
-
GVL Narasimha Rao: దసరా లోపు విశాఖ - వారణాసి రైలు: జీవీఎల్
-
Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
-
Delhi Robbery: ₹ 1400 పెట్టుబడితో ₹ 25 కోట్లు కొట్టేద్దామనుకున్నారు
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన