జ్యోతిక చిత్రంలో చిన్మయి పాట

సూర్య నిర్మాణంలోని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై జ్యోతిక నటిస్తున్న చిత్రం ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’. భాగ్యరాజ్‌, పార్తిబన్‌, త్యాగరాజన్‌, పాండియరాజన్‌, ప్రతాప్‌పోతన్‌లు వంటి సీనియర్‌ నటులు పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జేజే

Updated : 20 Mar 2020 09:59 IST

జ్యోతిక

కోడంబాక్కం: సూర్య నిర్మాణంలోని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై జ్యోతిక నటిస్తున్న చిత్రం ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’. భాగ్యరాజ్‌, పార్తిబన్‌, త్యాగరాజన్‌, పాండియరాజన్‌, ప్రతాప్‌పోతన్‌లు వంటి సీనియర్‌ నటులు పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జేజే ఫ్రెడరిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జ్యోతిక న్యాయవాది పాత్ర పోషిస్తోంది. కరోనా సమస్య వల్ల ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా ఆపివేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని రెండో పాట ‘వాన్‌ తూరల్‌గళ్‌..’ను విడుదల చేశారు. గోవింద్‌ వసంత సంగీతంలోని ఈ పాటకు ఉమాదేవి సాహిత్యం సమకూర్చారు. చిన్మయి పాడారు. పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా గాయని చిన్మయికి నటుడు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారతకు సంబంధించిన కథలను మాత్రమే ఎంచుకుని జ్యోతిక నటిస్తోంది. ఆ కోవలోనే ఈ సినిమా కూడా ఉంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని