చరణ్‌ బర్త్‌డే: పాత ఫొటోలు వైరల్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రామ్‌చరణ్‌. మాస్‌

Published : 27 Mar 2020 19:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రామ్‌చరణ్‌. మాస్‌ కమర్షియల్‌ సినిమాలే కాదు, ‘రంగస్థలం’ వంటి నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం.. రణం.. రుధిరం’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఎన్టీఆర్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా చరణ్‌ చిన్నప్పటి ఫొటోలు, అరుదైన సందర్భాల్లో దిగిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆయన తండ్రి చిరంజీవి కూడా ట్విటర్‌ వేదికగా ఓ ఫొటోను పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి ఫొటోలు మీరూ చూసేయండి.



















 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని