నిఖిల్‌-పల్లవివర్మల వెడ్డింగ్‌ వీడియో టీజర్‌

యువ కథానాయకుడు నిఖిల్, డాక్టర్‌ పల్లవి వర్మలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అతి కొద్ది మంది

Updated : 08 Dec 2022 16:41 IST

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నిఖిల్, డాక్టర్‌ పల్లవి వర్మలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు నిఖిల్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా షేర్‌ చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన వెడ్డింగ్‌ టీజర్‌ను విడుదల చేశారు.

‘‘నా వివాహ మహోత్సవానికి మీలో ప్రతి ఒక్కరూ రావాల్సి ఉంది.. కానీ, కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా అది కుదరలేదు. అయితే, ఈ వీడియో ద్వారా మీ ఆశీస్సులు, శుభాకాంక్షలు అందించండి. నాకు ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటి బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది.’’ -ట్విటర్‌లో అభిమానులను ఉద్దేశించిన నిఖిల్‌

‘ఏమాయ చేసావె’లోని ‘మనసా మళ్లీ మళ్లీ చూశా..’ పాట నేపథ్యంలో సాగే నిఖిల్‌-పల్లవిల వివాహ సంబరాల వీడియోను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు