Gopichand: నా పాకెట్ మనీ రూ. 1.. ఆ విషయంలో రాజీ పడను: గోపీచంద్
ఇంటర్నెట్ డెస్క్: ఆయన విలన్ పాత్ర పోషించిన సినిమా విజయం అందుకోవాల్సిందే. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురవాల్సిందే. యాక్షన్‌కు ఆయన రారాజు. అదొక్కటే ఆయన లక్ష్యం కాదు. యాక్షన్‌తోపాటు కామెడీని పండించి ప్రేక్షకులతో సీటీమార్ కొట్టించారు. రణం, లౌక్యం లాంటి పూర్తిస్థాయి యాక్షన్- ఎంటర్‌టైనర్ తర్వాత ‘పక్కా కమర్షియల్’(pakka commercial)తో మరికొన్ని రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నారు. ఆ స్టార్ ఎవరో కాదు గోపీచంద్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం జులై 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో గోపీచంద్(Gopichand) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ విశేషాలివీ..
* మీ గత సినిమాలతో పోలిస్తే ‘పక్కా కమర్షియల్’లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు?
గోపీచంద్: పక్కా స్టైల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. కాస్ట్యూమ్స్ వల్ల అంత స్టైలిష్‌గా కనిపిస్తున్నానేమో! వేషధారణలో మార్పులు వచ్చాయేమోగానీ నా ఫిట్‌నెస్ విషయంలో మార్పులేదు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ కరమ్ చావ్లా నన్ను బాగా చూపించారు. నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ ఆయనదే.
* మారుతితో సినిమా అనగానే మీకేమనిపించింది?
గోపీచంద్: ఈ సినిమా ఖరారుకాక ముందు మారుతి నాకు అంతగా పరిచయం లేదు. నిర్మాత వంశీ ఓసారి నన్ను కలిసి, మారుతితో సినిమా చేద్దామనుకుంటున్నా నువ్వు చేస్తావా అని అడిగారు. మారుతి ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు తీశారు.. యాక్షన్ కూడా కలిపితే మనకి ప్లస్ అవుతుంది కదా అని బదులిచ్చా. ఓకే అని చెప్పి, ఆయన కథ వినమన్నారు. కొన్ని రోజులకు మారుతి వచ్చి స్క్రిప్టు వివరించారు. అది పూర్తయ్యాక, ఈ సినిమాకి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పెడుతున్నట్టు చెప్పారు. కథకు తగ్గ పేరు అని అప్పుడే ఫిక్స్ అయ్యా.
* కథ విన్నాక మీరేమైనా సలహాలు ఇచ్చారా?
గోపీచంద్: ఆ అవకాశం మారుతి ఇవ్వలేదు. అంత అద్భుతంగా కథను రాసుకున్నాడు.
* మీ పాత్ర గురించి వివరిస్తారా?
గోపీచంద్: సాధారణంగా ప్రతి ఒక్కరూ కమర్షియల్‌గానే ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులోని కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దారు. నేనిందులో లాయరుగా కనిపిస్తా. ఈ క్యారెక్టర్ కమర్షియల్‌గానే కాదు ఎమోషనల్‌గానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.
* వ్యక్తిగతంగా మీరు కమర్షియలా?
గోపీచంద్: కమర్షియల్ అంటే డబ్బు అని అందరికీ తెలిసిందే. పరిస్థితులను బట్టి కొందరు డబ్బే ప్రధానంగా బతికితే మరికొందరు అవసరం మేరకు సంపాదిస్తుంటారు. నా విషయానికొస్తే.. నా పనికి తగ్గ మొత్తాన్ని ముందుగానే నిర్ణయించుకుంటా. దానికంటే ఎక్కువ తీసుకోను, తక్కువా తీసుకోను. ఈ విషయంలో నేను రాజీపడను. ఎందుకంటే నేను ఎవరికైనా సాయం చేయాలంటే ముందు నా దగ్గర మనీ ఉండాలి కదా. అది మినహా, ఇతర విషయాల్లో నేను కమర్షియల్ కాదు.
* మారుతి సినిమాల్లో కథానాయకుడి పాత్ర ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ఇందులోనూ అంతేనా?
గోపీచంద్: అవును. కథానాయకుడి కోణంలోనే ఈ కథ నడుస్తుంది. దానికి తగ్గట్టే మారుతి సంభాషణలు రాశారు. ఆయన చాలా స్పీడ్. ఆయన్ను అర్థం చేసుకోవడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది.
* మీ అభిమానులతో మాట్లాడుతుంటారా?
గోపీచంద్: నేను సోషల్ మీడియాలో అంత చురుకుగా ఉండను. సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు తప్ప వ్యక్తిగత విశేషాలు పంచుకోను. కానీ, మెసేజ్‌ల ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తుంటా.
* మీ తొలి పాకెట్ మనీ ఎంత?
గోపీచంద్: రూ. 1, రూ. 2 (పాఠశాల రోజుల్లో). అప్పుడు అవే ఎక్కువ (నవ్వుతూ..)
* మీ తొలి సంపాదన?
గోపీచంద్: రూ. 11,000. ‘జయం’ సినిమాకు తీసుకున్న తొలి పారితోషికమది. ఆ చిత్ర దర్శకుడు తేజ లక్కీ నంబరు 11.
* మీరు ఏ సినిమాకు అత్యధిక పారితోషకం తీసుకున్నారు?
గోపీచంద్: పక్కా కమర్షియల్. విజయాన్ని బట్టి పారితోషికం పెరుగుతుంటుంది కదా.
* పక్కా కమర్షియల్ చిత్ర బృంద సభ్యులను ఏ కరెన్సీతో పోలుస్తారు?
* మారుతి: ఇండియన్ కరెన్సీ
* రాశీఖన్నా: ఫారిన్ కరెన్సీ (యూఎస్ డాలర్స్)
* బన్నీవాసు: పౌండ్లు
* అరవింద్: దిర్హామ్
* వంశీ: ఏదీ కాదు. ఎందుకంటే ఆయన డబ్బు గురించి పెద్దగా ఆలోచించరు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs WI : ఐదో టీ20 మ్యాచ్.. విండీస్‌కు భారత్ భారీ లక్ష్యం
-
Politics News
Cabinet: ఆగస్టు 15కు ముందే ‘మహా’ కేబినెట్ విస్తరణ.. హోంశాఖ ఆయనకేనట?
-
World News
Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?
-
Sports News
INDw vs AUSw : క్రికెట్ ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆసీస్
-
Sports News
CWG 2022 : డబుల్స్ టీటీ.. రజతంతో సరిపెట్టుకున్న భారత్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?