Bheema: వాళ్ల కష్టం తెరపై కనిపించింది: గోపీచంద్‌

‘భీమా’ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. దీంతో చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది.

Published : 09 Mar 2024 14:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమా’. తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో చిత్రబృందం ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది.

‘మంచి సినిమాను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కథకు నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాలో నరేశ్‌ పాత్రకు మంచి ఆదరణ వచ్చింది. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తున్నంతసేపు చప్పట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులోని డైలాగులు, ఫైట్లు, మ్యూజిక్ ఇలా ప్రతిదాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. తెరపై చూస్తే అది అర్థమైంది. నాకు వ్యక్తిగతంగా కామెడీ అంటే ఇష్టం. ఇందులో ఫస్ట్‌హాఫ్‌లో సన్నివేశాలు అందరికీ బాగా నచ్చాయి. నరేశ్‌, నాకు మధ్య సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడే తెగ నవ్వొచ్చేది. కాసేపు పక్కకు వెళ్లి నవ్వుకొని వచ్చేవాడిని. నేను షూటింగ్‌ సమయంలో ఎంత ఎంజాయ్‌ చేశానో ఇప్పుడు ప్రేక్షకులు కూడా అలానే ఎంజాయ్‌ చేస్తున్నారు. అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి హాయిగా నవ్వుకోండి’ అని గోపీచంద్‌ అన్నారు. ‘నిన్న సినిమా విడుదలైన దగ్గర నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నా పాత్ర బాగుందని మొదట ఓవర్సీస్‌ నుంచి ఒకరు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత ఇక్కడి ప్రేక్షకుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. సంక్రాంతి, దసరా సినిమాల లాగా ‘భీమ్‌’ శివరాత్రి సినిమా’ అని నటుడు నరేశ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని