Oscars 2023: మూడోసారి ‘ఆస్కార్’ అందుకొని చరిత్ర సృష్టించిన దర్శకుడు
ఆస్కార్ అవార్డును ఏకంగా మూడు సార్లు గెలుచుకొని చరిత్ర సృష్టించారు దర్శకుడు గిలెర్మో దెల్ టోరో (Guillermo Del Toro). ఆయన ప్రతిభకు ప్రశసంలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు (Oscar Awards)ను గెలుచుకోవాలని సినీ రంగంలోని వారంతా ఉవ్విళ్లూరుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ అవార్డును ముద్దాడాలనుకుంటారు. ఒకే వ్యక్తికి మూడు సార్లు ఆస్కార్ అవార్డు వరిస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. ప్రస్తుతం అలాంటి అనుభూతిని ఆస్వాదిస్తున్నారు ప్రముఖ దర్శకుడు గిలెర్మో దెల్ టోరో (Guillermo Del Toro).
95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘పినాకియో’ (Pinocchio) సినిమా అవార్డును దక్కించుకుంది. ఈ చిత్ర దర్శకుడు గిలెర్మో దెల్ టోరో (Guillermo Del Toro) తన జీవితంలో మూడోసారి ఆస్కార్ వేదికపైకి వచ్చి అవార్డును తీసుకున్నారు. గతంలో గిలెర్మో దెల్ టోరో తెరకెక్కించిన ‘ది షేప్ ఆఫ్ వాటర్’ (The Shape of Water) చిత్రానికిగాను ఆయన రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. 2017లో విడుదలైన ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ గెలుపొందింది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్’ విభాగాల్లో పురస్కారం అందుకున్నారు.
ఈ ఏడాది.. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో (oscars 2023) ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) సినిమా ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్ నుంచి ‘ది ఎలిఫింట్ విస్పరర్స్’ బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌గా.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్