Hanuman OTT: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. ‘హనుమాన్‌’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌

‘హనుమాన్‌’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది.

Updated : 17 Mar 2024 11:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్‌’ (Hanuman) ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా ఆదివారం ఉదయం నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ సైతం శనివారం రాత్రి నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీలో చిత్రాన్ని వీక్షించిన పలువురు నెటిజన్లు క్లైమాక్స్‌ సీన్‌ విజువల్స్‌ షేర్‌ చేసి.. ‘అద్భుతం. ఎట్టకేలకు సినిమా చూశాం’, ‘తేజ సజ్జా యాక్టింగ్‌ బాగుంది. ఈ ఒక్క సీన్‌ చాలు ఈ ఏడాది అవార్డులన్నీ అతడికే వస్తాయని చెప్పడానికి’ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’. సూపర్‌హీరో కథకు పురణాలను ముడిపెట్టి దీనిని తీర్చిదిద్దారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, అమృతా అయ్యర్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపు 66 రోజుల తర్వాత ఇది ఓటీటీలోకి వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని