Updated : 30 Jun 2022 14:43 IST

Happy Birthday: గన్‌లతో ఫన్‌.. ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్‌ చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’  (Happy BirthDay). రితేశ్‌ రానా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమా కథ తుపాకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘నా ఏడు వారాల నగలతో చేయించా. నేనూ నా రవ్వల నెక్లెస్‌తో చేయించా’, ‘రివాల్వర్‌లో ఉండే రాజసం పిస్తోల్లో లేదండి’ అని గన్‌ల గురించి మాట్లాడుకునే సంభాషణలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘వాడు ప్రొఫెషనల్‌ కిల్లర్‌ అయితే నేను పెయిన్‌ కిల్లర్‌’ అని సత్య చెప్పడం, దానికి వెన్నెల కిశోర్‌ కౌంటర్‌ ఇచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. 

ట్రైలర్‌లో కనిపించిన ప్రతి పాత్ర చేతిలోనూ గన్‌ కనిపించింది. అసలు వీరందరికీ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటికీ బర్త్‌డే పార్టీకి సంబంధమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నరేశ్‌ అగస్త్య కీలక పాత్ర పోషించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని