Taapsee: ‘హసీన్ దిల్‌రూబా’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

  తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ‘హసీన్ దిల్‌రూబా’. వినిల్ మ్యాథ్యూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Updated : 12 Jun 2021 07:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ‘హసీన్ దిల్‌రూబా’. వినిల్ మ్యాథ్యూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జులై 2 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. దినేశ్ పండిట్ రాసిన పుస్త‌కాలు చ‌దివావా’ అనే సంభాష‌ణ‌తో ప్రారంభమైన ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. ఓ వైపు తాప్సీ జీవితంలోని విషాదాన్ని చూపించి, మ‌రోవైపు ఆనందాన్ని చూపించిన తీరు అల‌రిస్తోంది. తాప్సీ భ‌ర్త మ‌ర‌ణానికి కార‌ణం ఏంటి? ఆమె జీవితంలోకి రెండో వ్య‌క్తి ఎలా వ‌చ్చాడు? త‌దిత‌ర ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని