OTT Movies: ఈవారం ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా ఇది. ఎక్కడ ఏ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే?
ఇంటర్నెట్ డెస్క్: షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, సుధీర్‌బాబు ‘హంట్’ తదితర చిత్రాలు ఈ వారం విడుదలై బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. మరోవైపు, ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా/సిరీస్ అంటే?
ఆహా
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజెస్’ (18 Pages). గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈ నెల 27 నుంచి ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది. మరో ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లోనూ అదే రోజు విడుదలకాబోతుంది.
నెట్‌ఫ్లిక్స్
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో అనిరుధ్ అయ్యర్ తెరకెక్కించిన చిత్రం ‘యాన్ యాక్షన్ హీరో’ (An Action Hero). గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలై హిందీ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.
🎬 ది ఇన్విటేషన్ (ఇంగ్లిష్): జనవరి 28
🎬 స్నేక్ ఐస్ (ఇంగ్లిష్): జనవరి 29
🎬 పమేలా, ఎ లవ్ స్టోరీ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ): జనవరి 31
అమెజాన్ ప్రైమ్ వీడియో
🎬 ఎంగ్గా హాస్టల్ (తమిళ్) జనవరి 27
🎬 షాట్‌గన్ వెడ్డింగ్ (హాలీవుడ్) జనవరి 27
డిస్నీ+హాట్‌స్టార్
🎬 సాటర్‌డే నైట్ (మలయాళం, తెలుగు, హిందీ, తమిళ్) జనవరి 27
🎬 డియర్ ఇష్క్ (సిరీస్): జనవరి 26 నుంచి 31 వరకు (రోజుకో ఎపిసోడ్)
జీ5
🎥 జాన్‌బాజ్ హిందుస్థాన్ కీ (హిందీ, తెలుగు, తమిళ్): స్ట్రీమింగ్ అవుతోంది
🎥 అయలీ (తెలుగు, తమిళ్ సిరీస్): స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.