kollywood: డైరెక్టర్‌గా మారనున్న స్టార్‌ హీరో కుమారుడు..!

తమిళంలో ప్రముఖ హీరో కుమారుడు దర్శకుడు కానున్నాడనే వార్త జోరుగా ప్రచారం అవుతోంది.

Updated : 09 Jan 2023 13:14 IST

హైదరాబాద్‌: సినీ ఇండస్ట్రీకి మరో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. స్టార్‌ హీరో కుమారుడు త్వరలోనే డైరెక్టర్‌ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో విజయ్‌(Vijay) కుమారుడు సంజయ్‌(Sanjay) గతంలో తన డాన్స్‌తో అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత అతడు సినిమాల్లో నటిస్తాడని అంతా అనుకున్నారు. కానీ తను తెరపై మాత్రం కనిపించలేదు.

ప్రస్తుతం సంజయ్‌ దర్శకత్వానికి అవసరమైన పలు టెక్నికల్‌ కోర్సులను విదేశాల్లో అభ్యసిస్తున్నాడు. తాజాగా విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ చంద్రశేఖర్‌ ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ కుమారుడు సంజయ్‌కు దర్శకత్వంపై ఆసక్తి ఎక్కువ. తను డైరెక్టర్‌ అయితే మొదట విజయ్‌ సేతుపతితో సినిమా తెరకెక్కిస్తాడట. తర్వాత తన తండ్రితో సినిమా తీస్తాడట. ఈ విషయాన్ని నాతో ఒకసారి పంచుకున్నాడు’’ అని చెప్పారు. దీంతో సంజయ్‌ త్వరలోనే యాక్షన్‌ చెప్పనున్నాడనే వార్త తమిళ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. విజయ్‌ అభిమానులు ఇది విని ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

ఇక విజయ్‌ ‘వారిసు’(తెలుగులో ‘వారసుడు’)(Vaarasudu) చిత్రంతో సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సరసన రష్మిక(Rashmika) నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని