గోపీచంద్‌-మారుతి కాంబో టైటిల్‌ ఇదే!

గతేడాది ‘ప్రతిరోజు పండగే’ చిత్రంతో హిట్టు కొట్టిన డైరెక్టర్‌ మారుతి, ప్రస్తుతం గోపీచంద్‌తో సినిమా షురూ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను ‘పక్కా కమర్షియల్‌’గా ఖరారు చేశారు. సినిమా షూటింగ్‌ను మార్చి 5 నుంచి ప్రారంభించనుండగా,

Published : 14 Feb 2021 11:55 IST


హైదరాబాద్‌: గతేడాది ‘ప్రతిరోజు పండగే’ చిత్రంతో హిట్టు కొట్టిన డైరెక్టర్‌ మారుతి, ప్రస్తుతం గోపీచంద్‌తో సినిమా షురూ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను ‘పక్కా కమర్షియల్‌’గా ఖరారు చేశారు. సినిమా షూటింగ్‌ను మార్చి 5 నుంచి ప్రారంభించనుండగా, ఆక్టోబరు 1వ తేదిన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

గీతా ఆర్ట్స్‌2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌బిజోయ్ సంగీతం అందిస్తుండగా, కర్మ్‌చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గోపీచంద్‌, తమన్నా జంటగా సంపత్‌నంది డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సీటీమార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇవీ చదవండి

సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు

‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది..!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని