Naga Shaurya: ఆ నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి: నాగశౌర్య

‘రంగబలి’ (Rangabali) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు నాగశౌర్య (Naga Shaurya). ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు.

Published : 05 Jul 2023 19:43 IST

హైదరాబాద్‌: సాధారణంగా తాను రొమాంటిక్‌ వ్యక్తిని కాదని, తనకు సిగ్గు ఎక్కువని అన్నారు నటుడు నాగశౌర్య (Naga Shaurya). రొమాంటిక్‌ హీరోగా తాను నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సరిగ్గా ఆడలేదని చెప్పారు. కాస్త భిన్నంగా ఉండేందుకే తాను ‘రంగబలి’ చేశానని అన్నారు. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.

‘‘రొమాంటిక్‌ హీరోగా ఇటీవల నేను నటించిన నాలుగు సినిమాలు పరాజయం అందుకున్నాయి. అందుకే, రొమాంటిక్‌ తరహా పాత్రల నుంచి కాస్త విరామం తీసుకున్నా. కెరీర్‌ ఆరంభంలో నేను చాక్లెట్‌ బాయ్‌ పాత్రలు పోషిస్తే ప్రేక్షకులు అంగీకరించారు. కానీ, ఇప్పుడు వాళ్లు నన్ను అలాంటి పాత్రల్లో చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. ఇమేజ్‌ పరంగానూ మార్పు కోరుకుంటున్నా. ఆ మార్పుకు ఇది శ్రీకారం చూడుతుందని భావిస్తున్నా. ఇటీవల మా చిత్రాన్ని వీక్షించా. ఇది నాకెంతో నచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ తర్వాత నాగశౌర్య నటిస్తోన్న చిత్రమిది. పవన్‌ బాసంశెట్టి దీన్ని తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. యుక్తి తరేజ కథానాయిక. యూత్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి టాక్‌ అందుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని