Major: అడవి శేష్ ‘మేజర్’ ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
అడవి శేష్ కథానాయకుడిగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా ‘మేజర్’.
ఇంటర్నెట్‌డెస్క్: అడవి శేష్ కథానాయకుడిగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా ‘మేజర్’. ప్రకాశ్ రాజ్, శోభిత, సయీ మంజ్రేకర్, రేవతి కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘మేజర్’ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
- 26/11 ఉగ్ర దాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ను తెరకెక్కించారు.‘చాలా మందికి ‘మేజర్’ సందీప్ ఎలా చనిపోయాడో తెలుసు. కానీ, ఎలా జీవించాడో తెలియదు’ అంటూ ఆ విషయాలన్నీ ఎంతో హృద్యంగా చూపించాలనే ఉద్దేశంతోనే ‘మేజర్’ తీశారు అడవి శేష్.
- ఇందులో టైటిల్ రోల్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను యువ నటుడు అడవి శేష్ పోషించగా, శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘గూఢచారి’ తెరకెక్కింది.
- ఈ సినిమాకు ‘మేజర్’, ‘మేజర్ సందీప్’ అనే టైటిల్స్ అనుకున్నారు. చివరకు మొదటిదాన్నే ఖాయం చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో మాట్లాడి, సినిమా తీసేందుకు అనుమతి తీసుకుంది.
- నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్రలు ఈ సినిమా గురించి అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుకు చెప్పగా, ఆయన కూడా ‘మేజర్’ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇలాంటి సినిమాలో భాగస్వామిని కావడం నిజంగా సంతోషంగా ఉందని మహేశ్ అనేక వేదికలపై చెప్పారు.
- తెలుగుతో పాటు, ఉత్తరాది రాష్ట్రాలకు చేరువయ్యేలా ఏకకాలంలో ఈ సినిమాను హిందీలోనూ తెరకెక్కించారు. కరోనా కారణంలో కొన్ని రోజులు సినిమా చిత్రీకరణ వాయిదా పడింది.‘మేజర్’ మూవీ చిత్రీకరణకు 120 రోజుల సమయం పట్టింది. 75కు పైగా లొకేషన్ల, 8 భారీ సెట్లు వేసి చిత్రీకరణ జరిపారు.
- ‘మేజర్’ విడుదల సందర్భంగా చిత్ర బృందం వినూత్న ప్రచారానికి తెర తీసింది. ఎంపిక చేసిన నగరాల్లో కొంతమంది ప్రేక్షకుల కోసం ఈ సినిమాను ప్రదర్శించారు. విడుదలకు ముందే ప్రేక్షకుల కోసం ఓ సినిమాను ప్రదర్శించటం ఇదే తొలిసారి.
- 2008లో ఉగ్రదాడి జరిగినప్పుడు తొలిసారి ‘మేజర్’ సందీప్ గురించి అడవి శేష్ చూశారట. ఆయన్ను చూడగానే తన అన్నయ్యలా అనిపించారట. అప్పటి నుంచే ఆయన గురించిన కథనాలను, సమాచారాన్ని సేకరించటం మొదలు పెట్టారు.
- ‘మేజర్’ సందీప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అడవి శేష్ ఆయన తల్లిదండ్రులను కలిశారు. కొన్ని రోజులు వారితో కలిసి ప్రయాణం చేశారు. కొన్ని రోజులు అయిన తర్వాత సందీప్ తండ్రి మాట్లాడుతూ..‘నువ్వు మా అబ్బాయి గురించి సినిమా తీయగలవని 10శాతం నమ్మకం కలిగింది’ అనడంతో అందరూ నవ్వేశారట.
- అలా నాలుగైదు సార్లు బెంగళూరు వెళ్లి అడవిశేష్ సందీప్ తల్లిదండ్రులను కలిశారు. ఒకసారి వాళ్ల నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ కోసం వేచి చూస్తుండగా సందీప్ తల్లి అడవి శేష్‌ను పిలిచి ‘నా సందీప్‌లా ఉన్నావు’ అన్నారట.
- ‘మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం. ఆ పని చేసేటప్పుడు మన నిబద్ధత ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు’ అనుకుని సినిమా మొదలు పెట్టారట అడవి శేష్. అలా మొదలైన ‘మేజర్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక