థియేటర్లలోనే ‘ఇష్క్‌’.. విడుదల అప్పుడే..

టాలీవుడ్‌లో మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. పెద్ద తెరమీద సినిమా మాజాను ఆస్వాదించాలనుకునే సినీప్రేమికుల కల మళ్లీ నెరవేరబోతోంది. ఒక్కొక్కటిగా సినిమాలు థియటర్‌ విడుదలకు మొగ్గు చూపుతున్నాయి. తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన

Published : 20 Jul 2021 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. పెద్ద తెరమీద సినిమా మాజాను ఆస్వాదించాలనుకునే సినీప్రేమికుల కల మళ్లీ నెరవేరబోతోంది. ఒక్కొక్కటిగా సినిమాలు థియటర్‌ విడుదలకు మొగ్గు చూపుతున్నాయి. తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌’ను థియేటర్‌లోనే విడుదల చేస్తామని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. జూలై 30 ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇటీవల ‘జాంబీరెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను ఎస్.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని