RRR: రాజమౌళితో వివరంగా మాట్లాడాలనుకున్నా.. కానీ: జేమ్స్‌ కామెరూన్‌

ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళితో ఈ సినిమా గురించి వివరంగా మాట్లాడాలని ఆయన అన్నారు. 

Published : 12 Feb 2023 17:38 IST

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. ఈ జక్కన అద్భుతంపై సినీప్రియులంతా ప్రశంసలు కురిపించారు. ‘అవతార్‌’ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) గతంలో ఓసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఈ సినిమా చూసినప్పుడు తనకు కలిగిన అనుభూతిని గురించి తెలిపారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసి ఆశ్చర్యపోయానని చెప్పిన జేమ్స్‌ కామెరూన్‌ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర చాలా నచ్చిందని అన్నారు. ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఒక అద్భుతం. నేను మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. గ్రాఫిక్స్‌ మాత్రమే కాదు కథలో ఉన్న ప్రతి పాత్రను చాలా బాగా చూపించారు. కథ చెప్పడంలో షేక్‌స్పియర్‌ను తలపించారు. ఇక సినిమాలో రామ్‌ పాత్ర మరో స్థాయిలో ఉంది. రాజమౌళితో వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడాలనుకున్నా. కానీ, అతడిని కలిసినప్పుడు అంత సమయం దొరకలేదు. అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఈ సినిమా గురించి అతడితో ఇంకా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పారు.

ఇక ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. ఇటీవల ప్రకటించిన ఆస్కార్‌ నామినేషన్లలోనూ ఈ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని