kajal aggarwal: శ్రీలీల పక్కా ప్లానర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాజల్‌ అగర్వాల్‌

‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలో కాజల్ అగర్వాల్‌ కాత్యాయని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 12 Oct 2023 13:51 IST

హైదరాబాద్: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). ఇందులో కాజల్ అగర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. ఇందులో భాగంగా కాజల్ అగర్వాల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో సినిమా విశేషాలతో పాటు శ్రీలీల (Sreeleela) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సినిమాలతో పాటు వ్యక్తిగతంగా ఎదగడం కూడా చాలా ముఖ్యం. నేను సినిమాను అమితంగా ప్రేమిస్తాను. నా మొదటి ప్రాధాన్యం సినిమాలే. అలాగే, వ్యక్తిగత జీవితంలోనూ చాలా పనులు చేస్తున్నాను. ఛాలెంజ్‌గా తీసుకుంటే దేన్నైనా చేయగలం. ఈ లక్షణాన్ని నేను శ్రీలీలలో చూశా. తను చాలా తెలివైనది. ఎంతో కష్టపడుతుంది. అలాగే అందరితో ఎంతో విధేయతతో ఉంటుంది. తనేం చేయాలనుకుంటుందో తనకు తెలుసు. చాలా ప్లానింగ్‌తో ఉంటుంది. ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సెట్‌లో అందరితో చాలా సరదాగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఈ తరం హీరోయిన్‌లకు ఉండాలి. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు సోషల్‌ మీడియా వాడకం ఎక్కువగా లేదు. ఇప్పుడు ఏ విషయమైనా అందులో తెలిసిపోతోంది’ అని చెప్పారు. 

‘టైగర్‌ నాగేశ్వరరావు’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే!

‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’తో వరుసగా విజయాలను అందుకున్న బాలకృష్ణ (Balakrishna) ‘భగవంత్‌ కేసరి’తో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇందులో కాజల్ అగర్వాల్  కాత్యాయని పాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని