Kamal Haasan: 35 ఏళ్ల ‘పుష్పక విమానం’.. కమల్ హాసన్‌ హృదయపూర్వక సందేశం..

ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే కమల్‌ హాసన్‌, సింగీతం శ్రీనివాసరావుల కాంబినేషన్‌లో వచ్చిన పుష్పక విమానం సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కమల్ హాసన్‌ ట్విట్‌ చేశారు. 

Published : 28 Nov 2022 13:40 IST

హైదరాబాద్‌: భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘పుష్పక విమానం’ ఒకటి. ఈ అద్భుతం తెరమీద కనపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచి 35 ఏళ్లు పూర్తయింది. సినిమాలతో వివిధ ప్రయోగాలు చేస్తూ సినీ శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ నటించిన ఈ చిత్రం అప్పట్లో విజయకేతం ఎగురవేసింది. మాటలు లేకుండా తీసిన ఈ సినిమా విడుదలై మూడున్నర దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా కమల్‌ హాసన్‌ ట్విటర్‌ వేదికగా హృదయపూర్వక సందేశాన్ని షేర్‌ చేశారు.

‘‘నేను ఇప్పటి వరకు పనిచేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు వయసులో పెద్ద అయినా మనసులో మాత్రం అతి పిన్న వయస్కులు. మా ప్రయోగాత్మక చిత్రం పుష్పక విమానం విడుదలై 35 ఏళ్లు అయింది. ఇప్పుడు అది మా కంటే వయసులో పెద్దది. సింగీతం శ్రీనివాసరావు గారు, మనం మన కళను ఎప్పుడు నిత్యనూతనంగా ఉంచాలి. దానిని వయసుతో ముడిపెట్టకూడదు. నాకు ఇష్టమైన సంగీతాల్లో మీ నవ్వు కూడా ఒకటి’’ అని కమల్‌ తనకు సింగీతంపై ఉన్న గౌరవాన్ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని