keerthy suresh: సెట్లోకి తొలి అడుగు

దక్షిణాదిలో స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తున్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు ఉత్తరాదిలో జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. ఆమె తన తొలి హిందీ చిత్రం కోసం వరుణ్‌ ధావన్‌తో తెర పంచుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర సెట్లోకి కీర్తి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Updated : 02 Feb 2024 09:34 IST

క్షిణాదిలో స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తున్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు ఉత్తరాదిలో జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. ఆమె తన తొలి హిందీ చిత్రం కోసం వరుణ్‌ ధావన్‌తో తెర పంచుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర సెట్లోకి కీర్తి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ప్రేమ, యాక్షన్‌, వినోదం అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇది వరుణ్‌కు 18వ సినిమా. దీన్ని ఎ.కాళేశ్వరన్‌ తెరకెక్కిస్తుండగా.. అట్లీ, మురాద్‌ ఖేతాని, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వామికా గబ్బి కీలక పాత్ర పోషిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు  రానున్నట్లు తెలుస్తోంది. కీర్తి ఇప్పటికే హిందీలో ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తోంది. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సిరీస్‌ త్వరలో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని