Khiladi: ‘ఖిలాడి’ ట్రైలర్‌ వచ్చేసింది.. రవితేజ యాక్షన్‌ అదిరింది!

రవితేజ ‘ఖిలాడి’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.

Updated : 07 Dec 2022 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ హీరోగా నటించిన యాక్షన్‌- క్రైమ్‌ చిత్రం ‘ఖిలాడి’. ప్లే స్మార్ట్‌ అనేది ఉపశీర్షిక. రమేష్‌ వర్మ దర్శకుడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. రవితేజను ఈ సినిమాలో దర్శకుడు చాలా కొత్తగా చూపించబోతున్నారని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. రవితేజ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు అర్థమవుతోంది. రవితేజ చెప్పిన సంభాషణలు అందరినీ అలరించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా అర్జున్‌ కనిపించనున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ‘వీర’ తర్వాత రవితేజ- రమేష్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు