NTR: ‘కొమురం భీముడో’ఎన్టీఆర్‌ నటనకు ప్రేక్షకుల కన్నీరు!

కొన్ని సినిమాలు, సన్నివేశాలు ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. కామెడీ సీన్స్‌ ఎలా నవ్విస్తాయో, భావోద్వేగ సన్నివేశాలు అంతలా కంటతడి పెట్టిస్తాయి

Published : 27 Mar 2022 13:55 IST

హైదరాబాద్‌: కొన్ని సినిమాలు, సన్నివేశాలు ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. కామెడీ సీన్స్‌ ఎలా నవ్విస్తాయో, భావోద్వేగ సన్నివేశాలు అంతలా కంటతడి పెట్టిస్తాయి. అలాంటి నటనతో ప్రేక్షకులను కట్టిపడేయటం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల యువ నటుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా స్నేహానికి ప్రాణమిచ్చే కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ ఒదిగిపోయారు. తెరపై కొన్ని సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన అమాయకత్వం, రామ్‌తో కలిసి చేసే పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటన మెప్పిస్తోంది. ఇక ‘కొమురం భీముడో’ పాటలో ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తోంది. ఆ పాటలో ఎన్టీఆర్‌ను రామ్‌చరణ్‌ కొడుతుంటే థియేటర్‌లో ప్రేక్షకుల కళ్లు చెమర్చుతున్నాయి. థియేటర్‌లో ఆ సన్నివేశం చూస్తూ ఓ మహిళ భావోద్వేగానికి గురవుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. కాలభైరవ ఆలపించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని