Puneeth Rajkumar: రికార్డ్స్‌ బ్రేక్‌ చేయడమే అలవాటు

కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్‌’. చేతన్‌ కుమార్‌ తెరకెక్కించారు. కిషోర్‌ పత్తికొండ నిర్మించారు. తెలుగు నటుడు శ్రీకాంత్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు.

Updated : 12 Feb 2022 07:42 IST

కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్‌’. చేతన్‌ కుమార్‌ తెరకెక్కించారు. కిషోర్‌ పత్తికొండ నిర్మించారు. తెలుగు నటుడు శ్రీకాంత్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఈ ప్రపంచంలో మొత్తం మూడు మార్కెట్లు ఉన్నాయి. ఓపెన్‌ మార్కెట్‌, డీప్‌ మార్కెట్‌, డార్క్‌ మార్కెట్‌.. ఇది వరల్డ్‌ మాఫియా’’ అనే డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ‘‘గన్స్‌ పట్టుకుని నిలబడే వంద వేస్ట్‌ బాడీస్‌ కంటే.. గన్‌ లాంటి వాడిని ఒక్కడిని వెతికి తీసుకురండి. ఎదురు   నిలబడి కాపాడటం తెలుసుండాలి. ఎదురొచ్చే గుండెలో బుల్లెట్‌ దింపడం తెలుసుండాలి’’ అంటూ శ్రీకాంత్‌ చెబుతున్న డైలాగ్స్‌తో పునీత్‌ను   పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. ఇందులో ఆయన ఓ సెక్యూరిటీ కంపెనీ మేనేజర్‌గా కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆయన యాక్షన్‌ హంగామా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ‘‘నాతో పోటీకి వచ్చిన వాళ్లెవరూ గెలిచిన రికార్డ్సే లేవు’’ అంటూ విలన్‌ చెప్పగా.. ‘‘నాకు మొదటి నుంచి రికార్డ్స్‌ బ్రేక్‌ చేయడమే అలవాటు’’ అంటూ పునీత్‌ కౌంటరివ్వడం హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో ఉన్న సమయంలోనే పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూశారు. దీంతో.. పునీత్‌ పాత్రకు ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్‌ డబ్బింగ్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని