LEO: ‘లియో’.. రూ.1000 కోట్లు మేము ఆశించడం లేదు: చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌

‘లియో’ (LEO) సినిమా కలెక్షన్స్‌ విషయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రానికి మంచి ఆదరణ వస్తోందన్నారు.

Published : 21 Oct 2023 14:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లియో’ (LEO) సినిమా వసూళ్లపై చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌ (Lalitkumar) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వెళ్తుందని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు. అందుకు గల ప్రధాన కారణాన్నీ వివరించారు. అలాగే, తమిళనాడులో ఉదయం నాలుగు గంటలకు షోలు వేయకపోవడంతో దాదాపు రెండు లక్షల మంది వేరే రాష్ట్రాలకు వెళ్లి సినిమా చూశారన్నారు.

‘‘లియో’కు వస్తోన్న రెస్పాన్స్‌ పట్ల నాకెంతో ఆనందంగా ఉంది. మా చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు చేస్తుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే హిందీ మార్కెట్‌ నుంచి భారీ కలెక్షన్స్‌ ఆశించడం లేదు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్‌ షోస్‌ కోసం ఎంతో ప్రయత్నించాం. కోర్టుకు కూడా వెళ్లాం. అయితే, ఈ విషయంలో విజయ్‌ అస్సలు జోక్యం చేసుకోలేదు. ‘కోర్టుకు ఎందుకు వెళ్లారు. అంత అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో సినిమా రిలీజ్‌ కావాలని ఆయన కోరుకున్నారు. ‘మాస్టర్‌’ టైమ్‌లోనే విజయ్‌కు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నా. కాకపోతే ఆయన అంగీకరించలేదు. ‘నాకు జీతం ఇస్తున్నారు కదా. అది చాలు. ప్రత్యేకంగా గిఫ్ట్‌లు ఏమీ అవసరం లేదు’ అన్నారు. మా సినిమా చూసి రజనీకాంత్‌ నాకు ఫోన్‌ చేశారు. సినిమా తనకెంతో నచ్చిందని.. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు’’ అని లలిత్‌ కుమార్‌ తెలిపారు.

Bhagavanth Kesari: ఓ ఆడబిడ్డా.. జర పైలం.. భగవంత్‌ కేసరి చెప్పిన ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం

విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ‘లియో’ సిద్ధమైంది. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌ సర్జా, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, ప్రియానంద్‌ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిరోజే ఈ చిత్రం దాదాపు రూ.148 కోట్లు కలెక్షన్స్‌ అందుకుందని చిత్రబృందం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని