Chiranjeevi: చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లతో విజయ్‌ దేవరకొండ.. ఎక్కడ కలిశారంటే?

ప్రముఖ నటులు చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌తో కలిసి యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ముగ్గురు స్టార్లు ఒకే చోట చేరడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Published : 01 Aug 2022 20:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటులు చిరంజీవి (Chiranjeevi), సల్మాన్‌ ఖాన్‌తో (Salman Khan) కలిసి యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ముగ్గురు స్టార్లు ఒకే చోట చేరడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ వీరు ఎక్కడ కలుసుకున్నారంటే? చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబయిలో.. ఈ ఇద్దరిపై ఉర్రూతలూగించే ఓ పాటని చిత్రీకరించారు. ఆ సెట్‌లోనే విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), ఛార్మి (Charmy Kaur) వారిని కలిశారు. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌తో కాసేపు ముచ్చటించి, ఫొటో దిగారు. ఆ ఫొటోని విజయ్‌ దేవరకొండ, ఛార్మి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్’ సినిమాకి రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్‌’ రూపొందుతోంది. నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ (Liger). పూరి జగన్నాథ్‌, ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘లైగర్‌’ టీమ్‌కు చిరంజీవి, సల్మాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని