Love Today: ఓటీటీలోకి ‘లవ్‌ టుడే’ తెలుగు వెర్షన్‌ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘లవ్‌ టుడే’. ఓటీటీలోకి తెలుగు వెర్షన్‌ వచ్చేసింది.

Published : 23 Dec 2022 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వీయ దర్శకత్వంలో నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) హీరోగా నటించిన తమిళ చిత్రం ‘లవ్‌ టుడే’ (Love Today). కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో అదే పేరుతో నవంబరు 25న థియేటర్లలో విడుదలై, ఇక్కడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా తమిళ్‌ వెర్షన్‌ ఓటీటీలోకిరాగా శుక్రవారం తెలుగు వెర్షన్‌ను విడుదల చేసింది ‘నెట్‌ఫ్లిక్స్‌’ సంస్థ. 

ఇదీ కథ: ఐటీ ఉద్యోగి అయిన ఉత్తమ‌న్ ప్రదీప్ (ప్రదీప్ రంగ‌నాథ‌న్‌), నిఖిత (ఇవానా) ప్రేమించుకుంటారు. పెళ్లితో ఒక్కటి కావాలనుకుంటారు. వీరి ప్రేమ విష‌యం నిఖిత ఇంట్లో తెలుస్తుంది. ఆమె తండ్రి శాస్త్రి (స‌త్యరాజ్‌) ఒక‌సారి  ప్రదీప్‌ని ఇంటికి తీసుకుర‌మ్మని చెబుతాడు. ఓ షరతుపై వారి ప్రేమ‌ని అంగీక‌రిస్తాడు. ఒక రోజంతా ఒక‌రి ఫోన్‌ని మ‌రొక‌రు మార్చుకోవాల‌నేది ఆ కండిషన్‌. ఒక‌రి ఫోన్లు మ‌రొక‌రు చూసుకున్నాక కూడా ఆ జంట పెళ్లికి సిద్ధమైందా? త‌న ప్రేయ‌సి ఫోన్లో అబ్బాయిల‌తో సందేశాలు చూశాక ప్రదీప్ ఎలా స్పందించాడు? ప‌్రదీప్ ఫోన్లో యాప్స్‌, ఇత‌ర‌ సందేశాలు చూశాక నిఖిత ప‌రిస్థితి ఏంటి? పెళ్లైందా? లేదా? త‌దిత‌ర విష‌యాలతో మిగ‌తా క‌థ సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని