Mahesh Babu: వేడుకలో మహేశ్‌బాబు సందడి.. ఆ ఫొటోలకు నెటిజన్లు ఫిదా!
ప్రముఖ హీరో మహేశ్‌బాబు ఓ వేడుకలో పాల్గొని సందడి చేశారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర హీరోలు తమ సినిమాల కబుర్లు వినిపించినా, వ్యక్తిగత విషయాలు పంచుకున్నా సందడి మరో స్థాయిలో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహేశ్‌బాబు (Mahesh Babu) పోస్ట్ చేసిన ఫొటోల విషయంలో నెట్టింట ప్రస్తుతం అలాంటి హంగామానే కనిపిస్తోంది. తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మహేశ్ అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. తాను బాగా ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నారు. అంతకుమంచి ఆయన ఇతర వివరాలేమీ వెల్లడించేదు. అది ఎవరి వేడుక? ఎక్కడ జరిగింది? తదితర విషయాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, మహేశ్ లుక్‌కు మాత్రం ఇటు ఆయన అభిమానులు, అటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
‘సో క్యూట్, సూపర్ అన్నా, ఏం ఉన్నాడు మా అన్నయ్య!’ అని కొందరు కామెంట్లు పెడితే.. ‘మహేశ్ నువ్వింకా 20లోనే ఉన్నావ్, సూపర్ స్మైల్, మీరు అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా?’ అంటూ మరికొందరు అంటూ వ్యాఖ్యలు జోడించారు. మహేశ్ పోస్ట్ పెట్టిన కొన్ని క్షణాల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసిన కొందరు అభిమానులు మహేశ్ అందం గురించి చర్చించుకుంటున్నారు. ఆ ఫొటోల్లో ఆయన బ్లాక్ కలర్ సింపుల్ టీ షర్ట్‌లో కనిపించారు.
మహేశ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే.. ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) చిత్రంతో గతేడాది మంచి విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)లో నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈయనతో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) సందడి చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’