Cinema News: నవ్విస్తోన్న ‘ఎఫ్‌-3’ వీడియో.. మనసుని హత్తుకునేలా ‘మేజర్‌’

ఆసక్తికర ప్రాజెక్ట్‌ల విడుదలతో రానున్న రెండు శుక్రవారాల్లో సినీ ప్రియులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందనుంది. ఇందులో భాగంగా ఆయా చిత్రబృందాలు గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్‌ షురూ చేశాయి...

Updated : 25 May 2022 14:04 IST

హైదరాబాద్‌: ఆసక్తికర సినిమాల రిలీజ్‌లతో రానున్న రెండు శుక్రవారాల్లో సినీ ప్రియులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించనుంది. ఇందులో భాగంగా ఆయా చిత్రబృందాలు.. ఓవైపు ఇంటర్వ్యూలు, చిట్‌చాట్‌లు నిర్వహిస్తూనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌నూ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి.


‘ఎఫ్‌-3’ మేకింగ్‌ వీడియో..!

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ మల్టీస్టారర్‌గా సిద్ధమైన ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌-3’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. తమన్నా మెహ్రీన్‌ కథానాయికలు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఎఫ్‌-2’కు కొనసాగింపుగా ఇది సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా చిత్రబృందం ‘ఎఫ్‌-3’ మేకింగ్ వీడియో షేర్‌ చేసింది. డైరెక్టర్‌ యాక్టింగ్‌కి నటీనటులు నవ్వులు పూయించారు. ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకునేలా ఉంది.


హృదయాన్ని హత్తుకునేలా..

ముంబయి దాడుల్లో మృతి చెందిన వీర జనాన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రం ‘మేజర్‌. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈసినిమాలో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించారు. జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘హృదయమా’ వీడియో సాంగ్‌ విడుదల చేశారు.


‘విక్రమ్‌’ నుంచి..

కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో లొకేశ్‌ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈసినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలు పోషించారు. జూన్‌ 3న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పాటను చిత్రబృందం షేర్‌ చేసింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని