Cinema News: సంక్రాంతి బరిలో మలయాళం స్టార్‌!

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో ఖాళీ ఏర్పడింది. వాటిని చిన్న సినిమాలు, ప్రాంతీయ చిత్రాలు భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా మలయాళ

Updated : 05 Jan 2022 07:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో ఖాళీ ఏర్పడింది. వాటిని చిన్న సినిమాలు, ప్రాంతీయ చిత్రాలు భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఆయన నటించిన ‘సెల్యూట్‌’ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ గతంలోనే ప్రకటించింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో ఉండటంతో తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు దుల్కర్‌. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘సెల్యూట్‌’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారట.

రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియాగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేసింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయడం, 50శాతం సామర్థ్యంతో సినిమా ప్రదర్శన వంటి ఆంక్షలతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీంతో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’కు లైన్‌ క్లియరైంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఆది సాయి కుమార్‌ నటించిన ‘అతిథి దేవోభవ’ జనవరి 7న విడుదల కానుంది. సిద్దు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’.. కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పులి వాసు తెరకెక్కించిన చిత్రం ‘సూపర్‌ మచ్చి’ జనవరి 14న, మహేష్‌ మేనల్లుడు అశోక్‌ గల్లా ‘హీరో’ జనవరి 15న విడుదలకు సిద్ధమయ్యాయి. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సంక్రాంతికి సందడి చేయనున్నాయి.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని