Manchu Manoj: నాలుగేళ్ల ప్రేమ ఫలించినందుకు సంతోషంగా ఉన్నా: మనోజ్
తన వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు మంచు మనోజ్ (Manchu Manoj). తమ నాలుగేళ్ల ప్రేమ గెలిచిందని అన్నారు.
హైదరాబాద్: తన నాలుగేళ్ల ప్రేమ ఫలించి.. భూమా మౌనికా రెడ్డి(Mounika Reddy)తో వివాహం జరిగినందుకు సంతోషంగా ఉన్నానని నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) అన్నారు. సోమవారం ఉదయం భార్య, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.
‘‘జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చు. కానీ, ప్రేమ గెలవాలి. దాన్ని నేను ఎప్పటికీ నమ్ముతాను. ఎందుకంటే ప్రేమే గెలిచింది. 12 ఏళ్ల నుంచి మౌనిక నాకు తెలుసు. నాలుగేళ్ల క్రితం నేను వేరే లోకంలో ఉన్నప్పుడు తనే నాకు అండగా నిలిచింది. అలా, మేమిద్దరం మరింత చేరువయ్యాం. ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డాం. దేవుడి దయ వల్లే అందరూ కలిసి మా పెళ్లి చేశారు. బాబు నా జీవితంలోకి రావడం కూడా శివుడి ఆజ్ఞగానే భావిస్తా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం మా ఇద్దరికీ ఉంది. మా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే. అయితే, నాకు రాజకీయాల్లోకి రావాలని లేదు. వాటిపై ఆమెకు ఆసక్తి ఉంటే నేను అండగా ఉంటా’’ అని మనోజ్ వివరించారు. 2019లో ప్రణతీరెడ్డి నుంచి విడాకులు తీసుకున్న మనోజ్ తాజాగా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో హైదరాబాద్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
అన్న రాజమోహన్‌రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!
-
Ap-top-news News
Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం