Manchu Vishnu: కన్నప్ప కథ.. కామిక్‌ బుక్‌ విడుదల చేయనున్న మంచు విష్ణు

‘కన్నప్ప’తో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఇటీవల విడుదల చేసిన ఆ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు.

Published : 16 Mar 2024 17:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కన్నప్ప’ (Kannappa) ఫస్ట్‌లుక్‌కు వచ్చిన రెస్పాన్స్‌పై నటుడు మంచు విష్ణు (manchu vishnu) ఆనందం వ్యక్తంచేశారు. కన్నప్ప కథను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. తన తండ్రి పుట్టినరోజు నాడు కన్నప్పపై కామిక్‌ బుక్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు.

‘‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌పై చూపించిన విశేష ఆదరణకు ధన్యవాదాలు. మునుపెన్నడూ నేను ఇలాంటి పాత్రలు పోషించలేదు. అందువల్ల ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసే ముందు కాస్త కంగారుపడ్డా. భగవంతుడి ఆశీస్సులతోనే ఇది చేస్తున్నా. కన్నప్ప, శ్రీకాళహస్తి కథ అందరికీ చెప్పేందుకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కన్నప్ప చరిత్ర గురించి ఎంతోమంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఉత్తరాదిలో చాలామందికి ఆయన గురించి తెలియదు. ఒక్కొక్కరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాస్త కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే మార్చి 19న కన్నప్ప కథను తెలియజేస్తూ ఫస్ట్ వాల్యూమ్ కామిక్‌ బుక్‌ విడుదల చేస్తున్నా. ఇదొక కథల పుస్తకం. నా తండ్రి, నేను అభిమానించే నటుడు మోహన్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకుని దీనిని విడుదల చేస్తాం. పుస్తకం కావాలనుకున్నవారు ఇన్‌స్టాలో నాకు సందేశం పంపండి. మా సిబ్బంది తప్పకుండా మీకు వాటిని పంపిస్తారు. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కన్నప్ప కథ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని