Mishan Impossible: తాప్సీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’.. విడుదల ఆరోజే

చాలాకాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’.   

Published : 28 Feb 2022 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం స్వరూప్‌. ఆర్‌. ఎస్‌. జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్‌ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో తాప్సీతోపాటు ముగ్గురు చిన్నారులు పరుగు తీస్తూ కనిపించారు. ఈ విభిన్న కథా చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళీ నటుడు హరీశ్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌, ఛాయాగ్రహణం: దీపక్‌ యరగర, కూర్పు: రవితేజ గిరిజల, కళ: నాగేంద్ర.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని