Mrunal Thakur: నటిని అవుతానంటే ఇంట్లోవాళ్లు సపోర్ట్ చేయలేదు: మృణాల్ ఠాకూర్
తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). తొలినాళ్లలో ఇంట్లోవాళ్లు తనకు సపోర్ట్ చేయలేదని అన్నారు.
ముంబయి: ఇండస్ట్రీలో అడుగుపెడతానంటే కుటుంబసభ్యులు తనకు సపోర్ట్ చేయలేదని నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలిపారు. పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని వాళ్లు భయపడ్డారని ఆమె అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే, సినిమా పరిశ్రమ, ఇక్కడి వాతావరణంపై వాళ్లకు ఎన్నో భయాలు ఉన్నాయి. దాంతో నేను పరిశ్రమలోకి వస్తానంటే మొదట్లో అంగీకరించలేదు. ఆ తర్వాత వాళ్లకు నా ఇష్టం అర్థమైంది. టీవీ సీరియల్స్‌లో మంచి పాత్రలు పోషించి, అనంతరం మరాఠీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను పోషించే పాత్రల పట్ల ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. నా విషయంలో గర్వపడుతున్నారు’’ అని ఆమె (Mrunal Thakur) తెలిపారు.
అనంతరం, ఇటీవల తాను పెట్టిన ఓ పోస్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘కొన్ని సమయాల్లో మనం అందరి నుంచి మంచి మాటలు వినాలనుకుంటాం. మనల్ని ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండనుకుంటాం. కొన్నిసార్లు మనం ఏదో కోల్పోయినట్లు ఫీలవుతాం. ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. అంటే దాని అర్థం మానసిక కుంగుబాటకు గురయ్యామని కాదు. కాబట్టి, మానసికంగా బలహీనంగా ఉన్నామని కంగారు పడకండి. దాన్ని జయించండి’’ అని ఆమె (Mrunal Thakur) వివరించారు.
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ (Mrunal Thakur) మరాఠీ సినిమా ‘విటిదండు’తో తెరంగేట్రం చేశారు. ‘లవ్ సోనియా’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. గతేడాది విడుదలైన ‘సీతారామం’ ఆమెకు అంతటా విజయం వరించేలా చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
లైఫ్ జాకెట్ లేకుండానే 15 కి.మీ. ఈత
-
కృషి బ్యాంకు డైరెక్టర్ అరెస్టు
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్