Naga Chaitanya: జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది: నాగచైతన్య

నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Updated : 01 Jan 2024 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘తండేల్‌’(Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయిపల్లవి కథానాయిక. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రపై నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘2018లో ఆంధ్రప్రదేశ్‌ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది రూపొందుతోంది. స్ఫూర్తిదాయకమైన ప్రేమకథా చిత్రం. ఇది అప్పటి రాజకీయాలను కూడా ప్రశ్నిస్తుంది. ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. నాన్న, నేను మంచి స్నేహితుల్లా  ఉంటాం. ఈ ప్రాజెక్ట్‌ గురించి ఆయనతో చాలాసార్లు చర్చించాను. ఆయన అభిప్రాయాలను తీసుకున్నా. ఆయన నాకెప్పుడూ మంచి సలహాలిస్తుంటారు. విమర్శలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతారు. తప్పులు చేయడం వల్లే నేర్చుకోగలమని చెబుతుంటారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలని ప్రోత్సహిస్తారు. ఇంట్లో అందరం సరదాగా కూర్చొని భోజనం చేస్తాం. ఆ సమయంలో వర్క్‌ గురించి మాట్లాడుకోం’’ అని చెప్పారు. ఇక ‘తండేల్‌’ కోసం నాగచైతన్య ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొన్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవలే ‘దూత’ వెబ్‌ సిరీస్‌తో నాగచైతన్య మంచి విజయాన్ని అందుకున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారమైన ఈ సిరీస్‌లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఇదే జోష్‌తో ఆయన ‘తండేల్‌’ షూటింగ్‌ను ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని