ఏందిరా వదిలేస్తావా నన్ను..!

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరి’టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఫీల్‌గుడ్‌ సినిమాల దర్శకుడు శేఖర్‌కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. టీజర్‌ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టు

Updated : 10 Jan 2021 12:03 IST

‘లవ్‌స్టోరి’ టీజర్‌

హైదరాబాద్‌: నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరి’ టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఫీల్‌గుడ్‌ సినిమాల దర్శకుడు శేఖర్‌కమ్ముల దీనిని తెరకెక్కించారు. ‘అమిగోస్‌ క్రియేషన్స్’‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టీజర్‌ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాదీ‌ స్టైల్లో  ‘జీరోకెల్లి వచ్చినా సార్‌.. చానా కష్టపడతా..మంచి ప్లాను ఉంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. రేవంత్‌ పాత్రలో చై, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది. పవన్‌ సీహెచ్‌ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటోంది. చివర్లో నాగచైతన్యతో.. ‘ఏందిరా..వదిలేస్తావా నన్ను’ అంటూ సాయిపల్లవి అన్న మాటలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేశాయి. ఆ లవ్‌లీ టీజర్‌ను మీరూ చూసేయండీ!

ఇవీ చదవండి!

పిల్లడు అదుర్స్‌.. సాంగ్‌ అదిరింది

ఘనంగా సింగర్‌ సునీత వివాహం


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు