Namrata: స్టేజ్‌పై అదరగొట్టిన గౌతమ్‌.. నమ్రత ఫిదా

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌.. తన నటనతో అదరగొట్టేశాడు. థియేటర్‌ ప్రదర్శనలో డ్యాన్స్‌, డైలాగ్‌లు చెప్పి ఆకట్టుకున్నారు.

Published : 01 Dec 2022 17:12 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Maheshbabu) తనయుడు గౌతమ్‌ తన నటనతో అదరగొట్టేశాడు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా స్కూల్‌లో జరిగిన థియేటర్‌ ప్రదర్శనలో కథానాయకుడిగా సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘అతడు ప్రేమలో నిపుణుడు కాదు. కానీ, అతడికి ప్రేమలో అనుభవం ఉన్న స్నేహితులు ఉన్నారు. హైస్కూల్‌లో గౌతమ్‌ మొట్టమొదటి థియేటర్‌ ప్రదర్శన ఇది. తన స్టైల్‌తో అదరగొట్టేశాడు. ఫ్రోజెన్‌ ఫ్యామిలీని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. గౌతమ్‌ నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు మున్ముందు మరెన్నో ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన సూపర్‌ స్టార్‌ అభిమానులు.. లైక్స్‌ రూపంలో తమ ఆనందాన్ని బయటపెడుతున్నారు. ‘బేబీ సింహం ఫామ్‌లోకి వస్తోంది’, ‘సూపర్ గౌతమ్‌ చాలా బాగా చేశావు’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మహేశ్‌ హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’లో గౌతమ్‌ నటించిన విషయం తెలిసిందే. చిన్నప్పటి మహేశ్‌ రోల్‌లో అతడు కనిపించి.. అందర్నీ అలరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు