అస్సాం ఎక్కడుందో చెప్పాలి..

మ్యాప్‌లో అస్సాం రాష్ట్రం ఎక్కడుందో గుర్తించలేకపోయి, తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించారు యువ కథానాయకుడు నాని.

Updated : 29 Oct 2023 11:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యాప్‌లో అస్సాం రాష్ట్రం ఎక్కడుందో గుర్తించలేకపోయి, తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించారు యువ కథానాయకుడు నాని. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘No.1 యారి’ కార్యక్రమానికి నాయిక రీతూ వర్మతో కలిసి విచ్చేశారాయన. ఈ షోలో జరిగిన సందడి వీడియోను ఆహా పంచుకుంది. కెన్యా దేశాన్ని గుర్తించమని రీతూని, అస్సాం రాష్ట్రం ఎక్కుడుందో చెప్పమని నానిని అడగ్గా, ఇద్దరూ విఫలమయ్యారు. ఇలా కాదు అంటూ రానాని గుర్తించమని కొన్ని దేశాల పేర్లు చెబుతారు నాని. రానా ప్రయత్నం సఫలం అవుతుంది. దాంతో ‘నిజమో కాదో ఇంటికెళ్లి చెక్‌ చేసుకుంటా’ అని నాని వినోదాన్ని పంచారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సందడంతా మీరూ చూసేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని